Saturday 14 June 2014

భూమికి నక్షిత్రాల దూరం


Friday 13 June 2014

ఆత్మ విశ్వాసం


Saturday 7 June 2014

ఒక చిన్నారి సీత కథ


ఒకానొక ఊరిలొ కృష్ణా నది ఒడ్డున చిన్న పూలతోట ఉంది. ఆ పూలతోట మధ్యలో సీత అనే చిన్న పాప వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. ఒకరోజు ఉదయం ఇంకా పూర్తిగా తెలవారకముందే ఆ పూలతోటలో ఆడుకోవాలని రివ్వుమంటూ ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంట్లోనుండి బైటకు రాగానే పచ్చని తోట కొంచం తలెత్తి చూస్తే నీలాకాశం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ రెట్టించిన ఉత్సాహంతో మరింత ఎగురుకుంటూ ముందుకు సాగింది. బంతిపూల చెట్లు కనపడ్డాయి. "ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి, భూమి మొత్తం పూలతో సువాసనతో నిండి ఉన్నదా అనిపించేలా ఉంది" అని మనసులో అనుకుంది. ఆ పూలతోటను దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళింది. కొంతదూరం వెళ్ళాక కృష్ణానది తీరం కనపడింది ఆక్కడే కాసేపు కూర్చొని మబ్బుల మాటునుండి సింధూర వర్ణంలో ఉదయించే సూర్యుడిని చూస్తుంది. ఆ అందం చూస్తూ ఆనందంతో పొంగిపోయింది. అలా కొంతసేపు చూసాక వెనుక ఉన్న పూలతోటలోకి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది.
అలా స్నేహితులతో ఆ పూలతోటలో ఆడుకుంటూ ఉండగా ఎవరో తెలియదు ఒకామే వచ్చి సీతను గట్టిగా పట్టుకొని తాను నవ్వుకుంటూ ఎటూ వెళ్ళనివ్వకుండా తీసుకెళ్ళి సీతను ఒక గదిలో భందించింది. అస్సలు వెలుగే లేని ఆ గదిలో గాలి కూడా సరిగ్గా రాని ఆ గదిలో సీత ఒక్కతే ఉంది బిక్కు బిక్కు మంటూ... సీత బైటకు వెళ్ళే మార్గాలు కోసం ఎంతో ప్రయత్నించింది. కాని సాద్యం కాలేదు. సీత అమ్మకోసం ఎంతో ఏడ్చింది అమ్మా అంటూ గట్టిగా అరిచింది కాని ఏమి లాభం లేదు. సీత వాళ్ళ అమ్మ సీతకోసం వాళ్ళ ఇంట్లో ఎదురుచూస్తుంది. సీతకోసం పూలతోటలన్నీ కలయతిరుగుతూ వెతుకుతుంది.
సీత ఒక సీతాకోకచిలుక ప్రకృతిలో మనకి అందాన్ని, ఆనందాన్ని పంచుతూ విహరించే సీతాకోకచిలుక. కాని పాపం ఒకామే ఈ సీతాకోకచిలుకని గట్టిగా పట్టుకొని ఒక అగ్గిపెట్టెలో బంధించింది. ఈ బాధించే ప్రక్రియలో పాపం ఆ సీతాకోకచిలుక రెక్కలలో ఒకటి తెగిపోయింది. ఇంతలో సీతని అగ్గిపెట్టెలో బంధించిన ఆమే వచ్చి అగ్గిపెట్టెని తెరచింది. సీతని బైటకు తీసిచుస్తే ఒక రేక్కతో ఎగరలేక ఉన్న ఒక్క రెక్కతో ఒక వైపు బరువెక్కి నడవనూ లేక అలా పడిపోయింది. బంధించిన ఆమె కూడా "ఛి ఈ సీతాకోక చిలుక ఎగరట్లేదు" అని సీతను అక్కడే పడేసి వేరే సీతాకోక చిలుకని పట్టుకోవడానికి మళ్ళి పూలతోటకి వెళ్ళింది. ఇంతలో సీత అక్కడ పడిపోవడం సీత తల్లి చూసి అక్కడకు ఏడుస్తూ వచ్చి గుండెలు పెక్కడిల్లెలా ఏడ్చింది. రెక్క విరిగిన బాధతో సీత అలాగే ఏడుస్తూ చనిపోయింది. ఇలా తన బిడ్డను చూడలేక ఏడుస్తూ సీత తల్లి కూడా అక్కడే చనిపోయింది

మిత్రులారా మనం మన ఆనందానికి ఎన్ని సీతాకోకచిలుకలను పట్టుకొని బంధించి ఇలాగే బాధపెట్టి ఉంటాము కాని ప్రకృతిలో భాగమైన అవి మనకు రంగు రంగులతో అందాన్ని ఆనందాన్ని పంచుతున్నాయి కాని మనం మాత్రం వాటి ప్రాణం పోయేలా చేస్తున్నాం .. ప్రకృతిని ప్రేమిద్దాం మానవులగా జీవిద్దాం --- మీ బుజ్జిబాబు

ఈ మన Telugu mitrulam_01 page ని like చేసి ప్రోత్సహించగలరు...

శివ భక్తి


ఒకానొక ఊరిలో వీరయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు., చిన్నప్పటినుండి చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవాడు, భగవంతుని పై అమిత భక్తి కలవాడు. తాను ఎంత కష్టపడినా ఉన్నత స్థాయికి రావట్లేదు అని బాధ పడుతూ ఉంటే తన మిత్రుడు ఒకడు పక్క ఊరిలో ఉన్న శివాలయం దగ్గర జమ్మి చెట్టు ఒకటి ఉందని. ఆ శివాలయంలో దండం పెట్టుకొని ఆ చెట్టు దగ్గర బియ్యపు పిండి పంచదార బెల్లం చల్లితే మంచి జరుగుతుంది అని. అది విని ఆనందంగా తన భార్యతో సహా ఆ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. తన మిత్రుడు చెప్పినట్టే చేసాడు. భగవంతుని చిత్రమో లేక కాల మహిమో కాని తన జీవితంలో అభివృద్ధి మొదలయ్యింది.,
అప్పటి నుండి ఆ శివాలయంపై భక్తి బాగా పెరిగింది.
విరయ్యకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ కొడుకులతో సహా అభివృద్ధి కూడా పెరిగాయి., తన పిల్లలకి 15సంవత్సరాలు వచ్చేసరికి 10ఎకరాల ఆస్సామీ అయ్యాడు వీరయ్య. చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆ పిల్లలకి జ్వరం వచ్చినా, పరిక్షలలో మంచి మార్కులు రావాలన్న అలాగే భగవంతునిని వేడుకొనేవాడు.
ఒకరోజు హటాత్తుగా శివుడు వీరయ్యకు కలలో దర్శనం ఇచ్చాడు. తన ఇద్దరు కుమారులకు ఆస్తి పంచి తనని ఎప్పుడు వచ్చే శివాలయంలోనే ఉండిపొమ్మని అడిగాడు అది విని ఆనందంగా సరే అనుకున్నాడు మనసులో కాని పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కదా ఇంటిని ఎవరు సమర్ధవంతంగా పోషించగలరు స్వామి అని అడిగాడు. దానికి ఆ శివుడు "భక్త కొంత బియ్యపు పిండి పంచదార బెల్లం ఇచ్చి నీ ఇద్దరు కుమారులను నా శివాలయాని, ఆ చెట్టు మహిమ చెప్పి పంపు. వారికి తెలియకుండా వారి వెనుక నువ్వు కూడా వెళ్తూ వాళ్ళు ఏమి చేస్తున్నారో పరీక్షించు నీకే అర్ధమవుతుంది" అని అంతర్ధానం అయ్యాడు
తన కుమారులను ఇద్దరినీ పిలిచి బియ్యపు పిండి పంచదార బెల్లం ఇద్దరికీ సమానంగా ఇచ్చి పక్క ఊరిలో ఉన్న శివాలయం, ఆ చెట్టు మహిమ గురించి తెలిపి ఆ శివాలయానికి పంపించాడు. వారికి తెలియకుండా వారి వెనుకనే అనుసరించాడు వీరయ్య. ఇద్దరు పిల్లలు ఆ శివాలయం చేరుకున్నారు., చిన్నవాడైన రవి తన తండ్రి చెప్పినట్టే ఆ జమ్మి చెట్టు చుట్టూరా ఆ పిండి పంచదార బెల్లం చల్లడానికి వెళ్ళాడు అక్కడ చాలా మంది అదే పని చేయడానికి నిలబడి ఉన్నారు., తనవంతు వచ్చేవరకు వేచి ఉన్నాడు రవి. కాని పెద్దవాడైన రాము ఆ ఆలయం బైట ఉన్న బిక్షగాళ్ళను చూస్తూ ఉండిపోయాడు వారిలో చాలా మంది తిని ఎన్నిరోజులయ్యిందో చెప్పలేము. కొందరికి పొట్ట భాగమంతా లోతుకు వెళ్ళిపోయి చాలా హీనదశలో ఉన్నారు. చూసి చాలా బాధపడ్డాడు., ఏమి చేయాలో తనకి అర్ధం అవ్వలేదు. తన చేతిలో ఉన్న బియ్యపు పిండి పంచదార బెల్లాన్ని చూసి ఆనందపడి ఏదైనా చేయాలి వీటితో అని నిశ్చయించుకున్నాడు. ఆ పక్కనే ఉన్న శివాలయపు ద్వారం దగ్గర శివునికి అభిషేకం చేసిన పాలు బైటకు రావడం చూసి , ఆ పాలను కొంచం సేకరించి వాటిలో ఈ బియ్యపు పిండి, పంచదార బెల్లం కలిపి పాయసం లా తాయారు చేసి ఆ ఆకలితో ఉన్న పేదవారికి పంచాడు.
ఇది అంతా దూరం నుండి గమనిస్తున్న వీరయ్యకు రాముపై పట్టరాని కొమ వచ్చింది. తను చెప్పిన పనికి రాము చేసిన పని ఏంటి అని. కాని ఏమి అనకుండా ఉండిపోయాడు. పిల్లలు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు విరయ్య కుడా. రాము, రవి ఏమి చేసారో వీరయ్యకు వివరించారు. సరే అని తన కోపాన్ని ప్రదర్శించకుండా మిన్నకున్నాడు. మళ్ళి ఆ రోజు రాత్రి కలలోకి శివుడు ప్రత్యక్షమయ్యాడు., రవి చేసిన పనికి మెచ్చుకుంటూ రావియే సమర్ధుడని రాము తన మాట పాటించలేదని బియ్యపు పిండి పంచదార బెల్లం వృధా చేసాడని విన్నవించుకున్నాడు. అది అంతా విన్న శివుడు "వీరయ్య ఇప్పుడు నీకేమి అర్ధమయ్యింది" అని అడిగాడు . అప్పుడు వీరయ్య "రవికే నా కుటుంభ భాద్యతలు అప్పగించి నేను నీ దగ్గరకు వచ్చేస్తాను స్వామి" అన్నాడు.
అప్పుడు శివుడు "చూడు వీరయ్య మొదట్లో జనాలు తక్కువ ఉండేవారు గుడికి వచ్చే సంఖ్య కూడా తక్కువగా ఉండేది, ఆ రోజుల్లో చిన్ని చిన్ని జీవులయిన చిమలకు , ఉడుతలు లాంటి జీవులకి ఆహరం తక్కువగా దొరికేది. అందుకే అవి జమ్మి చెట్టుపై ఆధారపడేవి. నా ఆలయానికి వచ్చినవారు ఆ చెట్టుకి బియ్యపు పిండి పంచదార బెల్లం చల్లడం వల్ల వాటికి ఆహరం దక్కేది. అవి ఆనందించేవి. వాటికి ఆనందం కలిగించిన వారందరికీ నేను ఆనందం కలిగించేవాడిని. కాని అదే భక్తి అనుకోని అందరూ అలా చేయడం వల్ల వాటికి కూడా హాని కలుగుతుంది. కాని ఆకలితో ఉన్న సాటి మనుషులు బైట బాధపడుతున్నా పట్టించుకోకుండా ఎప్పటిలాగే చేస్తున్నారు. ఇది భక్తి కాదు. మనుషులు అంటే మనం ఆనందంగా జీవిస్తూ ఇతరులని కూడా ఆనందంగా జీవించేలా చేయడం. నువ్వు భక్తితో నీ భార్యని పిల్లలని వదిలేసి నా ఆలయానికి వచ్చి నాదగ్గర ఉండాలని నిశ్చయించుకున్నావ్. కాని నేను సర్వంతరయామి అని తెలియదా. ప్రతీ చోట ఉంటాను నేను. మరి నాదగ్గరకు రావడం అంటే అందరిని వదులుకొని రమ్మనా...?. నీ పని నువ్వు చేసుకుంటూ ఇతరులకి సేవ చేస్తూ ఉంటే అది కూడా భక్తే. మానవ సేవే మాధవ సేవ అని మర్చిపోయావా"అని చెప్పి."ఇప్పటివరకు నువ్వు సంపాదించావు ఇప్పటినుండి అయినా సేవ చెయ్యి అదే భక్తి" అని చెప్పి చిరునవ్వుని అందిస్తూ మాయం అయిపోయాడు"

ఇది భక్తి అంటే ఆకలితో ఉన్న పేదవారిని ఆదుకోవడం కూడా అని చెప్పే ఒక చిన్న ప్రయత్నం -- మీ బుజ్జిబాబు

ఈ మన Telugu mitrulam_01 page ని like చేసి ప్రోత్సహించగలరు...


Monday 2 June 2014

సమస్య-- పరిష్కారం